ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత పిల్లలకు చిరుతిళ్లు అమ్మేందుకు నిరాకరించాడు...చివరకు అరెస్ట్ అయ్యాడు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 08:31 PM

కాలం మారుతున్న మనషుల మనస్సు శుద్దికావడంలేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ వీధిలోని చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేందుకు నిరాకరించినందుకు ఓ దుకాణదారుడు అరెస్ట్ అయ్యాడు. ఓ షాపు యజమాని టెన్‌కాసిలో ఓ విద్యార్థుల బృందానికి చిరుతిళ్లను విక్రయించడానికి నిరాకరించాడు. పైగా ఒక వీధిలో ఉంటున్న వారికి వస్తువులు, సరుకులు అమ్మ వద్దని గ్రామ పెద్దలు ఆంక్షలు విధించారని చెప్పుకొచ్చాడు. అలా ఓ నిబంధన ఉందని.. విద్యార్థులను వారి ఇళ్లలో చెప్పమని కోరాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది.


ట్విట్టర్‌లో ఓ యూజర్ తమిళనాడులోని టెన్‌కాసీ జిల్లాలో ఒక దుకాణదారుడు సమీపంలోని ఓ పాఠశాలలోని దళిత పిల్లలకు చిరుతిళ్లు అమ్మేందుకు నిరాకరిస్తున్నాడు. అని రాసి సంబంధిత వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దుకాణదారుడు చెప్పిన విషయం స్పష్టంగా వినవచ్చు. " మీ వీధి ప్రజలకు ఏమీ విక్రయించకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇకపై మీరు ఊరి షాపులకి రాకూడదు" అని స్పష్టంగా చెప్పాడు. దాంతో ఆ చిన్నారులు బిత్తరపోయి.. అక్కడ నుంచి వెనుదిరిగారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ షాపు యజమాని మహేశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామ పెద్దల నిర్ణయంతోనే తాను ఇలా చేశానని ఆయన చెప్పాడు. దాంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్రామపెద్ద అని, అతడిని కూడా అరెస్ట్ చేసినట్టు జిల్లా అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ దుకాణాన్ని అధికారులు సీలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa