అనంతపురం జిల్లా పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లు, కూడళ్లు, రద్దీ ప్రదేశాలు, వాహనాల్లో వెళ్తున్న ప్రయాణీకులు, కాలనీలు... ఇలా అన్ని చోట్ల కొనసాగుతోన్న దిశ SOS యాప్ డౌన్లోడ్స్, రిజిస్ట్రేషన్లు. కింది స్థాయి పోలీసు సిబ్బంది మొదలు పోలీసు అధికారులు, గ్రామ/వార్డు సచివాలయాల మహిళా పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది సంయుక్తంగా నిమగ్నమయ్యారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతీ ఒక్కరూ రిజిస్ట్రేషన్, డౌన్లోడ్స్ చేయించాలని జిల్లా ఎస్పీ పిలుపు నిచ్చారు . జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు, విద్యార్ధులు మరియు అన్ని వర్గాల ప్రజలు మహిళల రక్షణకు తమ వంతు భాద్యతగా భావించి ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa