ఏలూరు జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. షిర్డీ నుంచి విశాఖ వెళ్తున్న షిర్డీ రైలు శనివారం సాయంత్రం ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెంబరు-2కి చేరుకుంది. రైలు స్టేషన్లోకి రాగానే ఎస్.. ఎస్3 బోగీల మధ్య ఉన్న కప్లింగ్ విరిగిపోయి లింక్ తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. దాంతో ఘోర ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa