గుంటూరు నగరంలో అడవి తక్కెళ్ళపాడు, వెంగళాయపాలెం యందు టిడ్కో గృహ సముదాయాలను ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ. త్వరలో టిడ్కో గృహ సముదాయాల యందు నిర్వహించాల్సిన పనులపై త్వరలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసిన వెంటనే, అర్హులైన పేదవారికి గృహాలను కేటాయించడం జరుగుతుందన్నారు.