వినుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో విద్య అగ్రహ దీక్ష పోస్టర్లను ఆదివారం మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 77 ను రద్దుచేసి పీజీ విద్యార్థులు అందరికీ ఫీజు రాయితీ వర్తింపచేయాలన్నారు. ఎయిడేడ్ విద్యా వ్యవస్థను పునురుర్దించి పేదలకు ఉచిత విద్యను అందించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, పూర్తిస్థాయిలో అందించాలన్నారు.