మాచర్ల పట్టణంలోని అనుపు చెంచు కాలనీ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ రమావత్ నీలావతి(46) పైన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి అనంతరం మహిళను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ సంఘటన గత శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధిత పోలీస్ ఉన్నత అధికారులు, ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డికి సమాచారం తెలియజేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa