యడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమనికి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అధ్యక్షుత వహించారు. పలువురు ఎస్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్టీ సామాజిక వర్గీయులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. కమ్యూనిటీ హాలు నిర్మాణాలకు, శిధిలావస్థలో ఉన్న భవనాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.