బ్రిటన్ రాణి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 8న రాణి ఎలిజబెత్-2 తుదిశ్వాస విడవగా 10 రోజుల నుంచి యూకేలో సంతాప దినాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి లండన్ హైడ్ పార్క్ కార్నర్‌లోని వెల్లింగ్టన్ ఆర్చ్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి అంతిమయాత్రను కొనసాగిస్తారు. రాచరిక సంప్రదాయంతో 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో రాణి అంత్యక్రియలు చేస్తారు.