బ్లడ్ క్యాన్సర్ ను గుర్తు పట్టడం కష్టమే. తెల్ల రక్తకణాల్లో ఈ క్యాన్సర్ వస్తుంది. చిన్న పనులకే ఆయాసం రావడం, బాగా నీరసపడిపోవడం, తెల్ల రక్తకణాలు పెరిగి ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం, తరచుగా జ్వరం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం, దెబ్బ తగలకపోయినా చర్మం కందిపోవడం, నెలసరి తరచుగా రావడం, బాగా ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, చంకలు, మెడ దగ్గర గడ్డలు ఏర్పడటం బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.