గోరువెచ్చని నీటితో జుట్టును తడిపి, బాగా తుడిచిన తర్వాత గడ్డపెరుగును జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పెరుగులోని విటమిన్-బి, హెయిర్ ప్రొటీన్ చుండ్రును నివారిస్తాయి. జుట్టు రాలే సమస్య పోతుంది. 2 కప్పుల పెరుగులో అర టీస్పూన్ మెంతి పొడి కలిపి, ఆ ప్యాక్ ను జుట్టుకు రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది.