దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు శుభవార్త తెలిపింది. ఈ ఏడాది దసరా సందర్భంగా ప్రజా రవాణా కోసం 1,081 అదనపు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు కొనసాగనున్న ఈ ప్రత్యేక సర్వీసులకు సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది. దసరా సందర్భంగా సోమవారం రాత్రి నుంచి నడిచే ప్రత్యేక బస్సుల జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయడంతో పాటు, వాటికి రిజర్వేషన్లను కూడా అనుమతించింది.