పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజిజు సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ని బీజేపీలో విలీనం చేశారు.అంతకుముందు రోజు, మాజీ ముఖ్యమంత్రి జాతీయ రాజధానిలో బిజెపి చీఫ్ జెపి నడ్డాతో సమావేశమయ్యారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.అమరీందర్ సింగ్ పార్టీలో చేరడం పట్ల న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేస్తూ దేశంలోని సరైన ఆలోచనాపరులు ఐక్యంగా ఉండాలని అన్నారు.