సోమవారం ఢిల్లీలో 30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ వ్యాధి సోకింది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు సంఖ్య 9కి చేరింది.దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసులు సంఖ్య 14కి చేరింది.సెప్టెంబర్ 16న బాధిత మహిళ లక్షణాలతో ఢిల్లీలోని ఎల్జేపీ ఆస్పత్రిలో చేరింది. పరీక్షల్లో ఆమెకు మంకీపాక్స్ ఉందని తేలింది. మంకీపాక్స్ లక్షణాలతో మరో నైజీరియన్ వ్యక్తి ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి.