బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లను సోమవారం ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్, పలువురు అధికారులు శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు , కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారిని శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదములు అందచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa