సంక్షేమ పథకాల అమలుపై దమ్ముంటే చర్చకు రావాలని కన్నబాబు సవాలు విసిరారు. మంగళవారం సభలో కన్నబాబు మాట్లాడారు. రైతు రుణమాఫీ చేస్తామని రూ.15 వేల కోట్లు ఇవ్వకుండా మోసం చేసిన బ్యాచ్ ఇది. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాయ చేశారు..చివరకు ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమ అంటే ..తిరిగి వాళ్లకే ప్రజలు బోట్లు, పంగనామాలు పెట్టారు. అన్నా క్యాంటీన్ గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. అదేదో గొప్ప ప్రాజెక్టు అన్నట్లుగా కలగలిపి తీసుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తుంటే..అక్కడ ఎవరిదైనా బర్త్‌డేలు, లేదా ఎవరైనా చనిపోతే దినం పేరుతో ఆ రోజు భోజనాలు పెట్టి దాన్ని అన్నా క్యాంటీన్ అన్నట్లుగా టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. సంక్షేమంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు పెట్టే మగాడు టీడీపీలో ఎవరూ లేరు. చేయలేక, చేతలేక తోక ముడిచి పారిపోయిన బ్యాచ్ వీళ్లు. రమ్మనండి..సరైన ఫార్మెట్లో రండి సభలో చర్చిద్దాం. ప్రతి గడపకు, తెలుగు దేశం కండువాలు వేసుకుని తిరుగుతున్న ఇళ్లకు కూడా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa