ప్రజల డేటాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారు అని మంత్రి రోజా వాపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... డేటాను చోరీ చేయాలనే ఈ దుష్ట సాంప్రదాయానికి తెర లేపారు. దానిపై హౌస్ కమిటీ వేసి ఈ రోజు ఆ రిపోర్టును హౌస్ కమిటీ పెట్టగానే టీడీపీ నేతల గుండెలు జారాయి. దీనిపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే కచ్చితంగా జీవితాంతం జైల్‌లో ఉంటారు. ఈ డేటా దొంగ డేరా బాబా కన్న డేంజర్ అన్నది గమనించాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ సాప్ట్‌వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారని ఆమె చెప్పారు. ప్రజా సాధికారత సర్వేలో మొత్తం డేటా తీసుకున్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే..దాదాపు 30 లక్షల ఓటర్లను తొలగించాలని దుర్మార్గంగా ఆలోచన చేశారు. దీనిపై సమగ్ర విచార ణ జరగాలి. ఓటర్లు డిలీట్ చేయడమే కాకుండా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేయించుకొని, వారిని బ్లాక్ మెయిల్ చేసి ఆ రోజు టీడీపీ చేర్చుకున్నారు. ఇలాంటి వాళ్లను వదిలిపెడితే సమాజం భ్రష్టుపడుతుంది అని ఆగ్రహం వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa