ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. సోమవారం వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఇదిరానున్న రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీంతో ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa