టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టులో సెప్టెంబర్ 17న ఊహించని ఘటన జరిగింది. ఈజిప్ట్‌కు చెందిన సీ ఈగల్ అనే కార్గో షిప్ వచ్చింది. దానిలోని కంటైనర్లను సిబ్బంది అన్ లోడింగ్ చేస్తున్నారు. ఇంతలో బ్యాలెన్స్ తప్పి ఆ భారీ ఓడ సముద్రంలోకి ఒరిగి పోయింది. ఈ ప్రమాదంలో 24 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ అక్కడి సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై టర్కీ పోర్టు అధికారులు విచారణ ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa