మాజీ మంత్రి నారాయణ కేసును చిత్తూరు జిల్లా న్యాయస్థానం ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేసి , న్యాయమూర్తి ఎదుట హాజరపరచగా బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే. బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు చెందిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం తొమ్మిదో అదనపు జిల్లా కోర్టులో వాయిదా ఉండగా, న్యాయమూర్తి శ్రీనివాస్ ఈ కేసును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa