కేరళకు చెందిన ఓ యువతి గుంతల రోడ్డుపై ఫోటో షూట్ చేయించుకుంది. సామాజిక బాధ్యతకు పెద్దపీట వేసిన ఈ వధువును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ యువతి తన ప్రి వెడ్డింగ్ ఫోటో షూట్ లో భాగంగా పెళ్లికూతురిలా ముస్తాబయ్యింది. గుంతలతో, వర్షపు నీటితో మడుగులా మారిన ఓ రోడ్డుపై ఫోటో షూట్ చేయించుకుంది. తన ఫోటోలు చూసైనా ప్రభుత్వం స్పందిస్తుందని భావించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa