జుట్టు రాలడం సమస్యకు మెంతులతో చెక్ పెట్టవచ్చు. ముందుగా కాస్త కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో కాస్త మెంతికూర వేసి చల్లారాక పక్కన పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు నూనెను తలకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచండి. మెంతులు కొన్ని వంటలలో కూడా ఉపయోగించవచ్చు. హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. అలాంటి వారు మెంతికూరను ఆహారంలో చేర్చుకుంటే మేలు జరుగుతుంది.