నులిపురుగులను తరిమేసి ఆరోగ్యంగా జీవిద్దామని ఖాజీపేట మండల వైద్యాధికారి డాక్టర్ బాల కొండ్రాయుడు పిలుపునిచ్చారు. ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్బంగా స్థానిక రవీంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ జూనియర్ కాలేజీ లో నులిపురుగు నిర్మూలన మాత్రలు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తరవాత ఒక అర్థ గంటకు మింగించారు.
1-19 సంవత్సరాలలోపు విద్యార్థులందరికి ఈ మాత్రలు వేశారని ఖాజీపేట వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు తెలియజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 1-3 సంవత్సరాల పిల్లలకు అర్ధ మాత్ర, 3-19సంవత్సరాలలోపు పిల్లలకు పూర్తి మాత్ర, చప్పరించేటట్లు ఏర్పాటు చేశారని, అందుకు అనుగుణంగా పిల్లలందరికి మాత్రలు వేసారన్నారు, తరవాత మండల ఆరోగ్య విస్తరణ అదికారులు మాచనూరు రాఘవయ్య, బి. నాగభూషణం మాట్లాడుతూ. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకొని మాత్రలు వేసుకోవాలన్నారు.
ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 12024 మంది 1-19 సంవత్సరాల పిల్లలకు ఈ మాత్రలు పంపిణి చేశారని, ఒకవేల ఎవరైనా ఈరోజు మాత్రలు వేసుకోకపోతే ఈ నెల 24 వ తేదీన కూడ వేస్తారని ఆరోజు మిస్ కాకుండా మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై. వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, ఏఓ వెంకటరెడ్డి ఆశా నోడల్ అధికారి అరుణకుమారి, సూపర్ వైజర్స్ పాల్గొన్నారు.