వట్టిచెరుకూరు: ఆవులలో విస్తరిస్తున్న ముద్ద చర్మవ్యాధి ప్రాణాంతకమని జిల్లా పశు వైద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చింతాపల్లిపాడు పశు వైద్యశాలలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి బుధవారం మాట్లాడారు. ఈ వ్యాధికి గురైన అనేక ఆవులు చనిపోతున్నాయని, వైద్యశాలలో లభించే టీకాలతో గోవులను కాపాడుకోవచ్చని చెప్పారు. పశు వైద్య శిబిరంలో 145 పశువులకు ఉచితంగా వైద్యం చేసి మందులు అందించారు.