గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు.తావరణాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలు, బహుముఖ విధానం ద్వారా ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన వంటి అంశాలపై మెరుగైన విధానాలను రూపొందించడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయాన్ని సృష్టించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సెప్టెంబర్ 23-24 తేదీల్లో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించనున్నారు.