మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అతని భార్య షబానాను సీబీఐ అధికారులు గురువారం పిలిపించి ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. వివేకా హత్యపై ఇతను చెప్పిన వివరాలే సీబీఐ అధికారుల విచారణలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దస్తగిరిని సీబీఐ అధికారులు మరోమారు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa