ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన చర్య అని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. గురువారం అవనిగడ్డలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య, విద్య పరిశోధన నిమిత్తం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ ది అన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సీఎం దుర్మార్గ చర్య అన్నారు.