రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో చేయూత కార్యక్రమంలో పాల్గొనటానికి విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10:05 గంటలకు రేణిగుంట ఏయిర్పోర్ట్ కు చేరుకొన్న వీరికి ఘన స్వాగతం లభించింది.
రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి నగర పాలక మేయర్ డా శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఎమ్మెల్యే లు భూమన కరుణాకరరెడ్డి కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి, రాజంపేట ఎం ఎల్ ఏ మేడా మల్లికార్జున తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, ఈ ఎం సి క్లస్టర్ సీఈఓ గౌతమి, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జేసి డి కే బాలాజీ తదితరులు ముఖ్య మంత్రిని ఘనంగా రిసీవ్ చేసుకునగా ముఖ్యమంత్రి ఉదయం10. 20గంటలకు కుప్పం చేయూత కార్యక్రమంలో పాల్గొనటానికి హెలికాప్టర్ లో పయనం అయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏయిర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, సి ఎస్ ఓ రాజశేఖర్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, ఏ ఎస్పీ సుప్రజ, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి బాలకృష్ణన్, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి, తిరుపతి రామారావు, కనక నరసరెడ్డి, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.