భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది కాబట్టి.. నాగ్‌పూర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లోకి తిరిగి రావాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆసీస్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.
రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ సాయత్రం 6.30 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక శుక్రవారం నాగ్‌పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. తేమ 78 శాతం ఉంటుందని అంచనా. టాస్‌పై మంచు ప్రభావం చూపించొచ్చని తెలుస్తోంది. ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకు లాభించనుంది.
నాగ్‌పూర్‌లో భారత్ మొత్తం 4 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శ్రీలంక, న్యూజిలాండ్‌ల చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2019లో నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ చివరి టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్.