తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తోటకూరలో విటమిన్ ఏ, సీ, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్ అధిక మోతాదులో ఉంటాయి. చిన్న పిల్లల ఎదుగుదలకు తోటకూర ఎంతో ఉపయోగపడుతుంది. తోటకూరలో ఉండే పోషకాలు గర్భస్త శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తరచూ తోటకూర తింటే కంటి సమస్యలు దరి చేరవు. అంతే కాకుండా ఊబకాయం నుంచి విముక్తి పొందాలనుకునే వారు దీనిని తరచూ తినడం మంచిది. తక్కువ కాలంలోనే బరువు తగ్గుతారు.