టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన అసాధారణ బ్యాటింగ్ తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని కొనియాడాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రోహిత్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసానికి కారణాన్ని రోహిత్ శర్మ వెల్లడించాడు. 'ఈ మ్యాచ్‌లో రోహిత్ చాలా జాగ్రత్తగా ఆడాడు. చాలా సెలెక్టివ్‌గా షూట్ చేస్తాడు. అతను సాధారణంగా ఫ్లిక్ షాట్లు మరియు పుల్ షాట్లు బాగా ఆడతాడు. ఈ మ్యాచ్ లోనూ ఆ షాట్లతో అలరించాడు. ఏ తప్పు చేయకుండా తన బలాన్ని నమ్ముకున్నాడు. బంతి వచ్చేదాకా ఎదురుచూశాడు.