ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కారణంగా శుక్రవారం కొండ చరియలు విరిగి పడ్డాయి. నజాంగ్ తాంబా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆది కైలాష్ మానస సరోవర యాత్ర కోసం యాత్రికులు ఉపయోగించే కీలక మార్గాన్ని మూసివేశారు. స్థానికులతో పాటు కనీసం 40 మంది యాత్రికులు తవాఘాట్ సమీపంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.