మంగళగిరి నగరంలోని ఇందిరానగర్ వైయస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పర్మినెంట్ వైద్యులు లేకపోవడంతో వివిధ వ్యాధులతో వచ్చే రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారిణి గత నెలలో గుంటూరు బదిలీపై వెళ్లారు. దీంతో నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇన్చార్జి వైద్యులుగా కొనసాగుతున్నారు. ఇన్చార్జి వైద్యాధికారి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేయాల్సి రావడంతో పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నారు. ప్రతిరోజు కేంద్రానికి సుమారు 40 మంది వరకు రోగులు రాగా ప్రస్తుతం రోజుకు సుమారు 15 మందిలోపే వస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరోగ్య కేంద్రానికి పర్మినెంట్ వైద్యాధికారిని నియమించాలని రోగులు కోరుతున్నారు.