తాడికొండ మండల పరిధిలోని వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే శ్రీదేవి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత ద్వారా ఇప్పటికే వేల కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.