రెండు నెలల్లో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ కోఆపరేటివ్ సొసైటీ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టర్ వారి ఛాంబర్ లో మల్టీపర్పస్ ఫెసిలిటి సెంటర్ల పనులను సమీక్షించేందుకు జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో ఆరు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు మంజూరు కాగా. అందులో ఒకటి పూర్తి దశలో ఉందని, మిగిలినవి 5 వివిధ దశలలో ఉన్నాయని, వాటి పూర్తి కోసం అధికారులు కృషి చేయాలన్నారు.
రెండవ దశలో 500 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో మంజూరైన గోడౌన్లుకు సంబంధించి పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా నిర్మిస్తున్న గోదాముల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులు, చెల్లింపులను ఎప్పటికప్పుడు కమిటీ పర్యవేక్షణలో పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా కో-ఆపరేటివ్ అధికారి సి. గురు ప్రకాష్ రావ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్‌కు వివరించారు. గోడౌన్ ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు.