గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా శనివారం మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి మైదుకూరు పట్టణములో 18 వ వార్డ్ లో పర్యటిస్తూ మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా ఇంటికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు శివ వెంకట ప్రసాద్ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, మాదవరాయ దేవస్థాన చైర్మన్ బూమిరెడ్డి సుబ్బారాయుడు, పట్టణ అధ్యక్షుడు లింగన్న, గోశెట్టి లక్షుయ్య, గోశెట్టి రామచంద్ర, నాయబ్ రసూల్, ఎలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.