కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై గంగన్న (42) అనూ కూలి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రేణిగుంట రైల్వే ఎస్. ఐ రవి తెలిపారు. వైయస్ఆర్ జిల్లా యర్రగుంట్లకు చెందిన గంగన్న మొదటి భార్య చనిపోవడంతో అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ఒంటిళ్లు కాలనీకి చెందిన యువతితో రెండో వివాహం చేసుకుని జీవనం సాగి స్తున్నాడు. తాగుడుకు బానిస కావడంతో భార్యతో విభేదాలు వచ్చాయి. రోజు సంపాదించిన డబ్బుతో తాగి ఇంటికి వెళ్లకుండా తిరుగుతూ ఉండేవాడు. జీవి తంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.