ఓ రోజువారీ కూలీ ఏకంగా రోబో తయారు చేశాడు. గోవాకు చెందిన బిపిన్ కదమ్‌కు సాంకేతికతపై ఏ మాత్రం అవగాహన లేదు. అతడి భార్య మంచాన పడింది. వారి 14 ఏళ్ల దివ్యాంగురాలైన కుమార్తె బాగోగులకు, ఆమెకు అన్నం తినిపించేందుకు రోబో తయారు చేశాడు. దానికి 'మా రోబోట్' అని పేరు పెట్టాడు. దీంతో బిపిన్ కదమ్‌ను గోవా ప్రభుత్వం ప్రశంసించింది. 'మా రోబోట్'ను మరింత అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ప్రకటించింది.