ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దసరా మహోత్సవాల్లో తొలిరోజు టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు సాధారణ భక్తుడిలో ఉచిత క్యూ లైన్లో నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. భక్తుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ప్రతి ఏడాది సాధారణ భక్తుడిలానే తాను దర్శనం చేసుకుంటానన్నారు. ఉచిత క్యూ మార్గంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు పాత బిల్లులకు చెల్లించారో, కొత్తగా చేపట్టారో చూడాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి ప్రసాదమైన లడ్డూలో బొగ్గు ముక్కలు వచ్చాయంటే అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అవగతమవుతుందన్నారు.