గుత్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం లో పని చేస్తున్న కార్మికుడు మహమ్మద్ (50) సోమవారం మృతి చెందాడు. కార్మికుడు మహమ్మద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూర్ బి, ఏఈ శరత్ చంద్ర, వైకాపా పట్టణ కన్వీనర్ డి. హుస్సేన్ పీరా వెళ్లి కార్మికుడి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.