సుప్రీంకోర్టు కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. కేసుల విచారణను ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దీంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రజలు చూడవచ్చు. కాగా తొలుత రాజ్యాంగ ధర్మాసనం విచారణను, ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణను కవర్ చేయనున్నారు. దీనిపై సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.