వైఎస్సార్ సీపీ మండల కార్యకర్తల సమావేశం మంగళవారం త్రిపురాంతకంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. బాలాత్రిపురసుందరీ దేవి ఆలయం వద్ద ట్రిపుల్ కే ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మండలంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.