ఒంగోలు: నూతన విద్యా విధానం అమలులో భాగంగా 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకాన్ని రూపొందించడానికి జిల్లాలోని ఆసక్తిగల రచయితల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ విజయభాస్కర్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి 9వ తరగతికి పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. అర్హులైన అధ్యాపకులు, విశ్రాంత ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను 5వ తేదీలోగా ఎస్సీఈఆర్టీకి మెయిల్ ద్వారా సమర్పించాలని కోరారు.