స్థానిక సెయింటాన్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఇటీవల ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోగా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయల చొప్పున కాలేజీ యాజమాన్యం సోమవారం ఆర్ధిక సహాయం అందజేసింది ఈ సందర్భంగా కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ రావు మాట్లాడుతూ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజిలో బి. టెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు యన్. దుర్గా భవాని, సయ్యద్ జిలానిలు ప్రమాద వశాత్తు సముద్రం లో మునిగి చనిపోయారని, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తల్లితండ్రులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం చేసామని చెప్పారు. మృతి చెందిన విద్యార్ధులకు ఆత్మశాంతి కలగాలని నివాళులర్పించారు. మృతుల తల్లిదండ్రులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అక్రిడేషన్స్ డైరెక్టర్ సి. సుబ్బారావు, ప్రిన్సిపాల్ ఎం. వేణుగోపాలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.