కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ సంస్థలనుకార్పొరేటీకరణ, ప్రైవేటికరణ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎన్ఏసిఎస్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టియుసి) ప్రధాన కార్యదర్శి సాలాపు మారయ్య ఆధ్వర్యంలో నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్ఎడి) మెయిన్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఈస్టరన్ నావెల్ కమాండ్ డీజీఎన్ పి యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. యూనియన్ అధ్యక్షులు కొండబాబు మాట్లాడుతూ అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని యూనియన్లు ఒకే తాటి పైకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి పోరాటాలు చేస్తే మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కానివ్వకుండా అడ్డుకోగలమన్నారు. యాజమాన్యాలు కుదుర్చుకున్న మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ను రద్దు చేసే వరకు భారత్ ఫోర్జ్ లాంటి కార్పొరేట్ శక్తులను అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టేవరకు కార్మికులందరూ ఐక్యతతో ప్రతి నేవల్ ఆర్నమెంట్ డిపో(ఎన్ఎడి) మెయిన్ గేట్ వద్ద నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. భారత్ ఫోర్జ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.