తడ మండలం బి. వి పాలెం లో గ్రామ సచివాలయాన్ని మంగళవారం స్థానిక శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు.ప్రజలకు పారదర్శకమైన పాలన దగ్గర చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిర్వచించి సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సచివాలయం ద్వారా ప్రజలు అన్ని రకాల సేవలు తక్కువ సమయంలో తమ ఊరిలోనే పొందవచ్చునని తెలియజేశారు. ఈయన వెంట సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తడ మండలం వైకాపా నాయకులు అధికారులు ఉన్నారు.