పశుసంవర్థక శాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై సీఎం ఆదేశాలు చేసారు. పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు వస్తాయన్న సీఎం. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం తోడ్పడుతుందన్న సీఎం. 80శాతం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది అని హామీ ఇచ్చారు.