బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు కేంద్ర సర్కార్ 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆరేళ్ల తర్వాత విచారణకు సిద్ధమైంది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.