ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ధర్మవరం 13వ వార్డు మునిసిపల్ కౌన్సిలర్ స్వర్ణలత, 29వ వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాతలు పేర్కొన్నారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో వైయస్సార్ చేయూత మూడో విడత లబ్ధిదారులకు నిధులు విడుదల కావడంతో లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సహా కౌన్సిలర్లు సచివాలయ ఉద్యోగస్తులు సి ఎం పాలాభిషేకము చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.