ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలోని 23వ వార్డు నందు అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా బుధవారం 15 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్లు ఇస్మాయిల్ లంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, లక్ష్మీచెన్నకేశ పాలక మండలి ఛైర్మన్, పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.