తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సీఎం జగన్ బుధవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. అనంతరం శ్రీరంగనాయక మండపంలో వేద పండితులు సీఎం వైయస్ జగన్‌కు ఆశీర్వచనం అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతన పరకామని భవనాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. రూ. 22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరకామని భవనం నిర్మించారు. అనంతరం టీటీడీ కోసం వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్నటిరోజు ప్రభుత్వం తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే.